నందిగామభారత్ ఆవాజ్ : నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో వివిధ రకాల టెండర్ కం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పీవీకే సీతారావమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ మంచాల మాధవరావు, ధర్మకర్తల మండలి సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు అమ్ముకునేందుకు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు, అమ్మవారికి సమర్పించిన చీరలు, జాకెట్ ముక్కలు అమ్ముకునేందుకు ఈ వేలంపాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ నిబంధనలకు అనుగుణంగా 2026 సెప్టెంబర్ 24న గురువారం ఉదయం 11 గంటలకు అధికారుల సమక్షంలో టెండర్ కం బహిరంగ వేలంపాట జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల వారు వేలంపాటలో పాల్గొనవచ్చని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.










