నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి, పెట్టుబడులపై కీలక నిర్ణయాలు!

0
1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

 

ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఈ భేటీలో మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ప్రధానంగా అమరావతి పునర్నిర్మాణం, రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, భూ సమీకరణ సంబంధిత అంశాలు అజెండాలో ప్రముఖంగా ఉండనున్నాయి.