స్థానిక ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలి: ఎమ్మెల్యే సౌమ్య

0
2

నందిగామ భారత్ ఆవాజ్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. బుధవారం నందిగామ కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నందిగామ మున్సిపల్ ఎన్నికలను టీమ్‌ వర్క్‌తో ఎదుర్కొనేందుకు ప్రతి వార్డులో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కూటమి ఐక్యతతో ఎన్నికల కార్యాచరణను పటిష్టంగా రూపొందించుకోవాలని సూచించారు.