భారీ వర్షాల వేల అప్రమత్తమైన చెట్టుపల్లి పంచాయితీ

0
1

అనకాపల్లి జిల్లా చెట్టుపల్లి: తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చెట్టుపల్లి గ్రామ పంచాయతీ యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.భారీ వర్షాల కారణంగా డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పూడికను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచే పనులు చేపడుతున్నారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.ఈ పనులు పంచాయతీ కార్యదర్శి శ్రావణి పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు వూడి కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రజల భద్రత, ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలే ఎంతో కీలకం అన్నారు. భారీ వర్షాల సమయంలో డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోతే వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి నీరు నిలిచిపోయే అవకాశం ఉంటుందని, అందుకే డ్రైనేజీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ వర్షపు నీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ప్రజలు కూడా డ్రైనేజీల్లో చెత్త వేయకుండా పంచాయతీ సిబ్బందికి సహకరించాలని, గ్రామ పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.పరిశుభ్రమైన గ్రామం – సురక్షితమైన ప్రజలు అనే లక్ష్యంతో పారిశుద్ధ్య చర్యలను నిరంతరం కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.