మైనర్‌ కేసు.. అబార్షన్‌ వ్యవహారంలో మరో నలుగురు అరెస్ట్.|

0
1

● అబార్షన్‌ వ్యవహారంలో నలుగురిపై చర్యలు

● ఆర్‌ఎంపీ, ఆస్పత్రి పీఆర్‌ఓ, నిర్వాహకులు అరెస్ట్

● మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో కొనసాగుతున్న దర్యాప్తు

అల్వాల్, సెప్టెంబర్ 24: మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మైనర్‌ బాలిక కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు.

బాలికకు అబార్షన్‌ చేయించిన వ్యవహారంలో వీరి పాత్రపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చర్యలు తీసుకున్నారు.

అరెస్టయిన వారిలో చిలుకానగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ భూక్య రవితో పాటు మేడిపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి పీఆర్‌ఓ ఊయల శ్రీనివాస్‌గౌడ్‌, ఆస్పత్రి నిర్వాహకులు కొండ జయసింహరెడ్డి, కొత్తపల్లి నరేష్‌ ఉన్నారు. 

వీరిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో మేడిపల్లికి చెందిన మాలోత్‌ రవి, బాలిక తల్లిని పోలీసులు ఈ నెల 21న అరెస్టు చేశారు. 

బాలిక గర్భం దాల్చిన విషయం వెలుగులోకి రావడంతో ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికకు అబార్షన్‌ చేయించిన వ్యవహారంపై దర్యాప్తు విస్తరించడంతో తాజాగా మరో నలుగురిపై చర్యలు తీసుకున్నారు.

అబార్షన్‌ నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసులో నిందితుల పాత్ర, వైద్య ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

#Sidhumaroju

Alwal