రోలుగుంట మండల పరిపాలన బాధ్యతలు చేపట్టిన పెట్టిన ప్రత్యేక అధికారి బివి సత్యనారాయణ

0
2

 రోలుగుంట: రోలుగుంట మండల ప్రత్యేక అధికారిగా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి బివి సత్యనారాయణ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఎంపీపీ పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అందులో భాగంగా రోలుగుంట మండలానికి సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సత్యనారాయణ మండలంలో ప్రస్తుతం అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, పెండింగ్ పనులపై స్థానిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల్లో వేగం పెంచాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో ఎంపీడీవో నాగేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో దుర్గాప్రసాద్, ఏఈలు రమేష్ బాబు, ఏఓ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.