కంచల రాళ్లవాగు ఉధృతి

0
1

రాకపోకలకు తీవ్ర అంతరాయం.. కల్వర్టు నిర్మాణానికి గ్రామస్తుల డిమాండ్

నందిగామ సెప్టెంబర్ 25 భారత్ ఆవాజ్ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగిపొర్లడంతో గ్రామానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి తలెత్తుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లేందుకు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

శాశ్వత పరిష్కారం చూపాలి

రాళ్లవాగుపై కల్వర్టు నిర్మిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి కల్వర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.