పేదలకు పట్టాభిషేకం సద్వినియోగం చేసుకోండి

0
2

అర్హులు పేర్లు నమోదు చేసుకోవాలి: కలెక్టర్ లక్ష్మీశ

 

విజయవాడ, సెప్టెంబర్ 25: పేదలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన నివేశన స్థల పట్టాలకు అమ్మకపు హక్కుతో కూడిన రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న అర్హులైన ఆక్రమణదారుల ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

అర్హులు తమ సమీపంలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు లేదా సంబంధిత తహశీల్దార్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 30న విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో అర్హులైన వారందరూ భాగస్వాములు కావాలని కోరారు.

ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యంతో పాటు ఇతర ప్రయోజనాలు పొందాలని కలెక్టర్ సూచించారు.