బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి దారుణ హత్య కేసును వేగంగా ఛేదించిన పోలీసులు, ముగ్గురు నిందితుల అరెస్ట్

0
58

ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు మేకర్తి మల్లక్క ఒంటరిగా నివసిస్తున్న విషయాన్ని గమనించి A1 మేకర్తి ధనంజయ్, బంగారు ఆభరణాల కోసం ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 30-08-2026 రాత్రి మృతురాలి ఇంట్లోకి ప్రవేశించిన A1 మేకర్తి ధనంజయ్, బండరాయితో తలపై దాడి చేసి హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు చెవి కమ్మలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బంగారు ఆభరణాలను విక్రయించేందుకు A2 నామేవత్ ప్రవీణ్ సహకరించగా, A3 రాపర్తి మహేష్ వాటిని తన వద్ద ఉంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులు A1 మేకర్తి ధనంజయ్ – 34 సంవత్సరాలు, A2 నామేవత్ ప్రవీణ్ – 22 సంవత్సరాలు, A3 రాపర్తి మహేష్ – 28 సంవత్సరాలు అని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుండి పోలీసులు 4 గ్రాముల బంగారు ఆభరణాలు, ₹1,500 నగదు మరియు రక్తపు మరకలు గల బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, టౌన్ సీఐ బి. రవికుమార్, ఎస్ఐ భోజ గౌడ్, కానిస్టేబుల్స్ ప్రేమ్ కుమార్, శేషారావు, సాగర్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ అభినందించారు. నేరాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా పోలీస్ శాఖ సూచించింది.