తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సోలో డాన్స్ పోటీల బ్రోచర్ ఆవిష్కరణ
పాల్వంచ: భద్రాద్రి 24 క్రాఫ్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాల్వంచ 38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్‌ను యూనియన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సోలో డాన్స్ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ వ్యవస్థాపకులు కడారి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు ఆలం శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కార్తిక్, కంచర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బత్తుల మధుచంద్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.










