ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై జ్యోతిబా పూలే అఖిల భారత OBC అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు న్యూఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం కొరవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలను మరింత నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.CEC జ్ఞానేశ్ కుమార్ పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణలకు, SIR అమలు తీరుపై, ఓటర్ల జాబితాల సవరణపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇటీవల ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలు కీలక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలను ప్రస్తావిస్తూ, ఈ పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. మొత్తం ప్రక్రియపై స్వతంత్రంగా, పారదర్శకంగా పరిశీలన జరగాలని కోరారు.ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి ఓటు రక్షణకు, స్వతంత్ర ఎన్నికల సంఘం పరిరక్షణకు, పారదర్శక ఎన్నికల వ్యవస్థ కోసం కేంద్రం స్పష్టమైన నియమాలు, బలమైన సంస్కరణలు తీసుకురావాలని పోతల ప్రసాద్ నాయుడు డిమాండ్ చేశారు.










