మీవి తప్పుడు రాతలు – ఎమ్మెల్యేవి నిద్రలేని ప్రగతి ఆలోచనలు! జగ్గయ్యపేట ప్రజలు నమ్మేది అభివృద్ధిని, మీ గాలి వార్తలను కాదు.”

0
13

​జగ్గయ్యపేట:

జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) నాయకత్వంలో టీడీపీ శ్రేణులు, సీనియర్ నాయకులు అంతా ఒక్కతాటిపై నిలిచి ప్రజారంజక పాలనను అందిస్తున్నారు. అయితే, ఈ అభివృద్ధిని ఓర్వలేక కొన్ని స్వార్థపూరిత బ్లూ మీడియా సంస్థలు పనిగట్టుకుని లేనిపోని అసత్య కథనాలతో శునకానందం పొందుతున్నాయి.

​అభివృద్ధి ఆలోచనలతోనే నిద్ర లేని రాత్రులు

​”ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదు” అంటూ పెట్టిన గాలి వార్తలకు స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు దీటుగా బదులిస్తున్నారు. నిజమే, శ్రీరామ్ తాతయ్య గారికి నిద్ర పట్టడం లేదు.. కానీ అది పదవుల కోసమో, రాబోయే ఎన్నికల భయంతోనో కాదు! గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వనాశనమైన జగ్గయ్యపేటను తిరిగి ప్రగతి పథంలో ఎలా నడపాలి? నియోజకవర్గ సమస్యలను ఎలా పరిష్కరించాలి? యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు, పేదలకు సంక్షేమం ఎలా అందించాలన్న నిరంతర తపనతో మాత్రమే ఆయన రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.

​కూటమి ఐక్యతపై అసత్య ప్రచారం సాగదు

​నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేతలు, కూటమి భాగస్వాముల మధ్య పూర్తి సమన్వయం ఉంది. ఎక్కడా ఎలాంటి వర్గపోరూ లేదు, గ్రూపుల ప్రశ్నే తలెత్తదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతుంటే, జీర్ణించుకోలేని కొన్ని వర్గాలు ఊహాజనిత కథనాలతో గందరగోళం సృష్టించేందుకు విఫలయత్నం చేస్తున్నాయి.

​సీటు నిర్ణయం అధిష్టానానిదే.. అనవసర రాద్ధాంతం ఎందుకు?

​ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉండగానే, ఇప్పటి నుంచే ఎమ్మెల్యే టికెట్ల గురించిన చర్చలు తేవడం ఆ మీడియా సంస్థల దిగజారుడుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీలో ఎవరి పాత్ర ఏమిటి, ఎవరి పనితీరు ఎలా ఉందన్నది పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గార్లకు స్పష్టంగా తెలుసు.

​శ్రీరామ్ తాతయ్య దశాబ్దాలుగా పార్టీకి చేసిన సేవలు, ఆయన విధేయత, నాయకత్వ పటిమపై అధిష్టానానికి పూర్తి విశ్వాసం ఉంది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసే క్రమశిక్షణ గల సైనికుడు ఆయన. ఇలాంటి సీనియర్ నేతపై తప్పుడు కథనాలు అల్లితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఇప్పటికైనా గాలి వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.