🟢అంగన్‌వాడీ ఉత్సవంలో పోషణపై అవగాహన
చందర్లపాడు, సెప్టెంబర్ 26 bharat aawaz :చందర్లపాడు మండలంలోని చందర్లపాడు గ్రామంలో 9వ జాతీయ పోషణ మాసంలో భాగంగా ఈసీసీఈ (ECCE) కార్యక్రమం, అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు నందిగామ సీడీపీఓ లక్ష్మీ భార్గవి ఆదేశాల మేరకు సూపర్‌వైజర్ శ్రీలత ఆధ్వర్యంలో గ్రామంలోని 1, 2, 3, 4, 5 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతల సంరక్షణ, శిశు సంరక్షణ, పోషకాహారం, పరిశుభ్రత, తల్లి–శిశు ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యాబోధన, టీకాలు, పిల్లల ఎత్తు–బరువుల పరిశీలన వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం, పరిశుభ్రత, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, టీకాలు ఎంతో ముఖ్యమని అంగన్‌వాడీ సిబ్బంది వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామంలోని లబ్ధిదారులు, చిన్నారులు, తల్లిదండ్రులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.










