వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కల్వకుర్తిలో వినాయక నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి, భక్తుల ఆధ్వర్యంలో శోభాయాత్రగా తరలించారు. మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.










