షేక్ బడేమియా కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు

0
3

ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల: మండలంలోని గండేపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ పంచాయతీ వార్డు సభ్యులు షేక్ బడేమియా కుమారుడు రవూఫ్ పాషా అకాల మరణం పట్ల నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

రవూఫ్ పాషా భౌతికకాయానికి నివాళులర్పించిన డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి బాధలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రవూఫ్ పాషా మృతి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని రవూఫ్ పాషాకు నివాళులర్పించారు.