మంచిర్యాల: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో శనివారం పీవీఆర్ గార్డెన్స్‌లో అండర్-14, అండర్-17 బాలబాలికల ఫెన్సింగ్ ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్, జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి ఎండీ యాకూబ్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ కుమార్ ప్రారంభించారు. వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు తాళ్ల సంపత్ రెడ్డి, పట్టి ప్రకృతి వెంకటేష్, కర్రు శ్రీనివాస్, రగ్బీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లింగంపల్లి శేఖర్, కాంగ్రెస్ నాయకులు భీమిని రాజేష్, కోడూరి విజయ్, అక్కపురం సతీష్, మాజీ ఉపసర్పంచ్ మోతే కనకయ్య, నిర్వాహకులు ఈదునూరి వెంకటేష్, ఆవునూరి మహేష్, సీనియర్ క్రీడాకారులు ఆవునూరి సురేష్, కటకం కళ్యాణ్, దుంపటి మధు, వివిధ పాఠశాలల పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.










