చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

0
1

ఆంధ్రప్రదేశ్ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ రమాదేవి విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ 

నందిగామ, సెప్టెంబర్ 26:

చిట్యాల ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా నందిగామ పట్టణంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి రాష్ట్ర ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ రమాదేవి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నందిగామ పట్టణం బైపాస్ రోడ్డులో డేరాల్లో నివాసముంటున్న పేద విద్యార్థులకు దేవరకొండ రమాదేవి పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

దేవరకొండ రమాదేవి మాట్లాడుతూ.. చిట్యాల ఐలమ్మ పోరాట పటిమ, ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మేకల రోజా, షేక్ రజియా బేగం, తిరుమల గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.