*పండుగవతారణంలో యువనాయకులు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి జన్మదిన వేడుకలు*
*మీ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను..*
*బర్తడే బాయ్ మండిపల్లి నిచ్చల్ నాగిరెడ్డి…*
రాయచోటి పట్టణం మదనపల్లె రోడ్డు మార్గంలో ఉన్నటువంటి రాయుడు కాలనీలో ఏపీ రవాణా,యువజన,క్రీడల శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,హరితమ్మల తనయుడు యువనాయకులు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో రాయుడు కాలని రంజిత్ రాయల్ పండుగ వాతావరణంలో నిర్వహించారు.ముందుగా ఆయనకు రాయుడు కాలని రంజిత్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు,యువకులు,అభిమానులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు.అనంతరం రామాలయంలో నిశ్చల్ నాగిరెడ్డి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాయుడు కాలని యువత బర్తడే బాయ్ నిశ్చల్ నాగిరెడ్డి తో పాటు మడితాటి శ్రీనివాసులు రెడ్డి లను రంజిత్ రాయల్ శాలువాలతో సత్కరించి గజామలతో సన్మానించారు.అక్కడ నుండి బారి జనసంద్రోహం తో డీజే,బాణాసంచాలు పేలుస్తూ,యువత ఉత్సాహం తో నిశ్చల్ నాగిరెడ్డి నీ ఊరేగింపుగా తీసుకువచ్చారు.మహిళలు మంగళ హారతులు ఏర్పాటు చేశారు.టీడీపీ నాయకులు రంజిత్ రాయల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బారి కేక్ కటింగ్ నిర్వహించారు.యువనాయకులకు కేక్ తినిపించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఈలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడు ఆశీస్సులతో యువనాయకులు సుఖశాంతులతో జీవించాలని ఆకాక్షించారు.నా జన్మదిన వేడుకలను ఇంత మంది పెద్దలు,అభిమానులు,యువత నడుమ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని యువనాయకులు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి పేర్కొన్నారు…….










