బాపట్లలో తొలిసారిగా ‘BEATS BY THE BAY @ SURYALANKA’*

0
1

బాపట్ల:

సూర్యలంక బీచ్‌ను పర్యాటక గమ్యస్థానంగా మరింతగా ప్రోత్సహించే లక్ష్యంతో బాపట్లలో తొలిసారిగా ‘BEATS BY THE BAY @ SURYALANKA’ పేరిట మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, IAS ఆవిష్కరించారు.

యువా గ్రూప్ ఆధ్వర్యంలో 2026 అక్టోబర్ 10న సూర్యలంకలోని హరిత బీచ్ రిసార్ట్ వేదికగా ఈ మ్యూజికల్ నైట్ జరగనుంది. కార్యక్రమంలో లైవ్ మ్యూజిక్, జమ్మింగ్, డీజే మ్యూజిక్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.సూర్యలంక సముద్రతీర అందాలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులు, సంగీతాభిమానులు, యువతకు ఈ కార్యక్రమం ప్రత్యేక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

“సూర్యలంక సముద్రతీరంలో సంగీతం, యువత ఉత్సాహాన్ని కలిపి ప్రత్యేక అనుభూతిని అందించడమే మా లక్ష్యం”* అని నిర్వాహకులు పేర్కొన్నారు.