ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. ప్రధానంగా ఆరు జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండనుంది. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉంది. వీటితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఇతర జిల్లాల్లోనూ కొన్నిచోట్ల చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురవవచ్చని అధికారులు పేర్కొన్నారు.










