దేవిరెడ్డిపల్లి ఏపీఎంఎస్‌లో ఎస్‌ఎంసీ ఎన్నికలు

0
4

భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి ఏపీఎంఎస్ పాఠశాలలో మంగళవారం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించారు.ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా శోభారాణి, వైస్‌ చైర్‌పర్సన్‌గా శారద ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌లను ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎన్. మూర్తి అభినందించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం యాజమాన్యం, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.