లింగాలపాడు పాఠశాలల నూతన కమిటీలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుభాకాంక్షలు
లింగాలపాడు పాఠశాలల SMC చైర్మన్లుగా కోటయ్య, పావని, కళ్యాణి
🟢లింగాలపాడు ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీల (SMC) ఎన్నికలు పారదర్శకంగా పూర్తి..!
నందిగామ, సెప్టెంబర్ 29 bharat aawaz : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్‌గా జరుగుమల్లి కోటయ్య, వైస్ చైర్మన్‌గా మార్కాపుడి లక్ష్మి; మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (HW) చైర్మన్‌గా నకిరేగంటి పావని, వైస్ చైర్మన్‌గా కరిసా సాహితి; మెయిన్ పాఠశాల చైర్మన్‌గా ఉప్పుతోళ్ల కళ్యాణి, వైస్ చైర్మన్‌గా ఉప్పుతోళ్ల గోపి ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతుల కల్పనకు కమిటీలు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీల చైర్మన్లు మాట్లాడుతూ.. పాఠశాలల సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మరియు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తామని, ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉమ్మనేని విక్రమ్, వడ్లమూడి పెద్ద శీను, దిగుమతి రాంబాబు, చుంచు సూరిబాబు, వడ్లమూడి చిన్న శీను, కట్టుకూరి సూర్యం, అమ్మినేని వేణు, జనసేన నాయకులు జాబిశెట్టి మధుసూదన్ రావు మరియు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









