Madanapalle: మదనపల్లెలో ప్రపంచ రేబిస్ దినోత్సవ గోడ ప్రతులు ఆవిష్కరణ. రేబిస్ నివారణ చర్యలు, టీకాల ప్రాముఖ్యతపై జేసీ శివనారాయణ శర్మ అవగాహన. పూర్తి వివరాలు.

0
1

Madanapalle: ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన ప్రచార సామాగ్రిని సోమవారం పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తో పాటు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై. శ్రీనివాసులు, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ గుణశేఖర్ పిళ్లై, ఇతర శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రేబిస్ అత్యంత ప్రాణాంతకమైన జూనోటిక్ వ్యాధి అని, వ్యాధి నివారణలో అవగాహన, సకాలంలో టీకాలు వేయించుకోవడం అత్యంత కీలకమన్నారు. ఈ ఏడాది “కలిసికట్టుగా… మరింత బలంగా” అనే నినాదంతో రేబిస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపా రు.