హెచ్‌పీసీఎల్ అధికారులతో ప్రభుత్వ విప్ గణబాబు భేటీ

0
3

ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అభిషేక్ త్రివేది, సీజీఎం (హెచ్‌ఆర్) జి. కిరణ్ కుమార్‌లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా గొల్లపాలెం, రామ్‌నగర్ గెడ్డల గుండా వర్షపు నీరు సాఫీగా వెళ్లకుండా హెచ్‌పీసీఎల్ పరిధిలోని అడ్డంకుల వల్ల నిలిచిపోయి వరద ముప్పు ఏర్పడుతోందని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గెడ్డల్లో పూడిక, ఇతర అడ్డంకులను వెంటనే తొలగించి, వరద నీరు సాఫీగా బయటకు పోయేలా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని హెచ్‌పీసీఎల్ ఉన్నతాధికారులను ఆయన కోరారు.