ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన పదాధికారుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీ ఆర్. లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.
ఈ నెల అక్టోబర్ 4వ తేదీన (ఆదివారం) మధ్యాహ్నం 03:00 గంటలకు ఆసిఫాబాద్‌లోని ఎంపీడీఓ (MPDO) మీటింగ్ హాల్లో రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ పదాధికారుల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నికైన మేనేజింగ్ కమిటీ సభ్యులందరూ నిర్ణీత సమయానికి, నిర్దేశించిన ప్రాంతంలో జరిగే ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ సూచించారు.









