చెట్టుబల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

0
3

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో గురువారం ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.గ్రామంలోని అర్హులైన పెన్షన్ దారులకు కూటమి నాయకులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పెన్షన్ నగదును అందజేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నామని కూటమి నాయకులు తెలిపారు. ఉదయం 6 గంటలకే పంపిణీ ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలలోపే పెన్షన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షులు వూడి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను సకాలంలో అందించడం తమ బాధ్యత అని తెలిపారు. ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలలోపే ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మార్గదర్శకత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా కూటమి నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు కలిమి సత్తిబాబు, విఆర్వో నానాజీ, విలేజ్ సర్వే అధికారి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.