సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా గోపాలపట్నం సీహెచ్‌సీలో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు

0
4

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా చేపట్టిన ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా గోపాలపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో (CHC) ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ప్రారంభించారు.

 ​అనంతరం ఆయన ఆసుపత్రిలోని రోగులు, గర్భిణులతో మాట్లాడి అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం, ఉచిత మందులు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆ తర్వాత గణబాబు గారి ప్రత్యేక కృషితో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘సదరం’ క్యాంపును పరిశీలించి, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా ధ్రువీకరణ పత్రాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు