ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనూష మాట్లాడుతూ.. సమాజంలో వయోవృద్ధులకు అండగా నిలవడం, వారి హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని పిలుపునిచ్చారు. వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, తక్షణ సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 14567 కు కాల్ చేసి తగిన న్యాయం పొందవచ్చని ఆమె సూచించారు.
ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ హరితతో పాటు పలువురు అధికారులు, వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









