అక్టోబర్ – 01 అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఈరోజు గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ఆవరణం మొత్తం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండటం చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు తయారు చేసిన డిస్ ప్లేలను మరియు క్రాఫ్ట్ వర్క్ లను చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. అంత చక్కగా నేర్పిస్తున్న వొకేషనల్ టీచర్ ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులను మిషన్ మార్చ్ కోసం వారి ప్రిపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి అడిగిన ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి నాణ్యత చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. భోజన సమయంలో విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అన్ని సౌకర్యాలు బాగున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టాఫ్ తో మాట్లాడారు మరియు స్టోర్ రూమ్ ను పరిశీలించారు. మొత్తంగా పాఠశాల నిర్వహణ అంతటికీ కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లారు. కార్యక్రమంలో తాసిల్దార్ నాగమ్మ, మండల విద్యాశాఖ అధికారులు జాన్ ప్రసాద్, జగ్గారావు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ పర్యటన తమ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపిందని ప్రిన్సిపల్ తులసి తెలిపారు.










