జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చింతూరులో సీఆర్పీఎఫ్ డీ/42వ బెటాలియన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంతోష్ కుమార్ సింగ్, ఇన్స్పెక్టర్ సి. అన్బుచెజియన్, చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, ఎస్హెచ్ఓ సంతోష్ కుమార్, సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధికారులు పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడం, కాలుష్య నియంత్రణలో చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. చెట్లు వాతావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు ఆక్సిజన్‌ను అందించి జీవజాల మనుగడకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడాన్ని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
# Yadagiri









