పాలపాటి ఆంజనేయస్వామి సన్నిధిలో విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు

0
3

భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం శ్రీ పాలపాటి ఆంజనేయస్వామి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోగ్యంగా ఉంటూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని బీజేపీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.