కెప్టెన్ స్మిత్ మచ్చర్ దైవ సాహసాలకు అభినందనలు. పోతల ప్రసాద నాయుడు

0
1

న్యూఢిల్లీ అక్టోబర్ 3:  భారతీయ విమాన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన తెగువకు, ధైర్యసాహసాలకు జ్యోతిరావు ఫూలే ఓబిసి నేషనల్ అసోసియేషన్ జాతీయ ప్రతినిధి పోతుల ప్రసాద్ నాయుడు అభినందనలు తెలిపారు. విమానంలో జరిగిన ప్రమాదకర పరిస్థితుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విమాన సిబ్బంది మరియు ప్రయాణికులను రక్షించేందుకు కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కత్తిపోట్లతో శరీరం గాయాలైనప్పటికీ ప్రయాణికుల భద్రత కోసం ఆయన చూపిన సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం ప్రశంసనీయమని తెలిపారు.

తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ నిజమైన వీరుడని, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పోతుల ప్రసాద్ నాయుడు అన్నారు. ఆయన భారత్ కు తిరిగి వచ్చిన అనంతరం సంస్థ తరపున సత్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలను గుర్తించి భారత ప్రభుత్వం తగిన జాతీయ స్థాయి పురస్కారంతో సత్కరించాలని, రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ది న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన వార్త కథనంపై పోతుల ప్రసాద్ నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కథనంలోని అంశాలు భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ ప్రచురణను ఖండించారు. భారతీయులు ఎక్కడ ఉన్నా శాంతికాముకులుగా, మానవతా విలువలను గౌరవించే వారిగా, సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునే వారని, ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు ముందుండటం మన సంప్రదాయమని, అందుకు కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలే గొప్ప ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.