కొవ్వూరు ఎనిమిదో వార్డులో సమస్యల పరిష్కారం పట్ల హర్షం

0
2

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామం ఎనిమిదో వార్డులో విద్యుత్ మరియు పారిశుధ్య సమస్యను త్వరితగతిన పరిష్కరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడం మరియు పారిశుధ్య కార్మికులు చెత్తను తీయకపోవడంపై వార్డు ప్రజలు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పంచాయతీ కార్యదర్శి విద్యుత్ సమస్యను పునరుద్ధరించి, చెత్తను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.సమస్యను తక్షణమే పరిష్కరించినందుకు ఎనిమిదో వార్డు స్థానికులు పంచాయతీ కార్యదర్శికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.