కర్నూలు జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు రూరల్ మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. “కర్నూలు జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించినప్పుడు.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఈ మూడు మండలాల్లో మాత్రం కరువు ఎందుకు కనిపించలేదు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.










