కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ దీక్ష భూమిలో రౌండటేబుల్ సమావేశం ఎస్సీ-ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్లోని 12 హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ దీక్ష భూమి ప్రాంగణంలో నిర్వహించిన ఎస్సీ 59 కులాల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని, జనాభా దామాషా ప్రకారం వాటా కేటాయించాలని స్పష్టం చేశారు. నిరుపేద ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇవ్వడంతో పాటు ‘అంబేద్కర్ అభయ హస్తం’ కింద స్వయం ఉపాధికి రూ. 12 లక్షలు మంజూరు చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎస్సీలకే కేటాయించాలన్నారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, అంబేద్కర్ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ గ్రామాలలో ఆదివాసులతో సమానంగా ఎస్సీలకు హక్కులు కల్పించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, విద్యా, వైద్యం, న్యాయం ఉచితంగా అందించాలని కోరారు. త్వరలోనే జిల్లాలో “ఎస్సీ 59 కులాల ఆత్మగౌరవ జిల్లా మహాసభ” నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశం అనంతరం నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్, ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి సురేష్, ప్రధాన కార్యదర్శి రాజు నర్సయ్య, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్, ఎన్ ఎస్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం సందీప్, సెంటర్ కమిటీ అధ్యక్షులు మసాదే ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్, ఉపాధ్యక్షులు చెంద్రీ చంద్రయ్య, కోశాధికారి అనిల్, మాజీ అధ్యక్షులు జాడి బాపు, జాడి కృష్ణ జీ, దుర్గం శ్యామ్ రావు, దీక్ష భూమి అధ్యక్షులు దుర్గం తుకారం, మహిళా విభాగం నేతలు రమాదేవి, ప్రమీల, సులోచన, కమిటీ సభ్యులు చంద్ర శేఖర్, సుధాకర్, ప్రసాద్, జ్ఞానేశ్వర్ తదితరులు










