తాళ్లపాలెం శాఖా గ్రంధాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమం

0
2

తాళ్లపాలెం: తాళ్లపాలెం శాఖా గ్రంథాలయంలో ఈరోజు చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు బి. సురేష్ కుమార్ గారు హాజరయ్యారు. ఆయన పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పుస్తకాలు మనకు మంచి స్నేహితుల లాంటివని, పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానంతో పాటు మంచి వ్యక్తిత్వం అలవడుతుందని తెలిపారు. చిన్నతనం నుండే పిల్లలు గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం గ్రంథాలయాధికారి కె. జగన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి మాట్లాడుతూ ప్రతి శనివారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పిల్లలలో పఠనాభిరుచిని పెంపొందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుస్తకాలు చదివి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.