హైదరాబాద్: దివంగత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజ్ సమీపంలోని కాకా విగ్రహానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పూలమాల వేసి నివాళులర్పించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాకా చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు,కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి రమేష్ బాబు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, కాకా అభిమానులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకా ఆశయ సాధనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.










