లాభాల వాటా వెంటనే చెల్లించాలి : ఏఐటీయూసీ

0
4

శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులకు లాభాల వాటాను వెంటనే చెల్లించాలని, జెన్‌కో, ట్రాన్స్‌కో తదితర సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను తక్షణమే వసూలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం శ్రీరాంపూర్ SRP3&3A గని మేనేజర్ వెంకటరావుకు గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు,ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్‌కే. బాజీ సైదా మాట్లాడుతూ దసరా సమీపిస్తున్నందున లాభాల వాటాను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. సింగరేణికి రావాల్సిన బకాయిలు ఆలస్యం కావడంతో సంస్థపై ఆర్థిక భారం పెరుగుతోందని, రక్షణ పరికరాలు, మెటీరియల్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు,కార్యక్రమంలో తౌటం మల్లేష్, అంబాల రవి, కారుకూరి నాగేష్, కాశిపేట విక్కీ, రాచర్ల రవీందర్, ఆడెపు సురేష్, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.