నెల్లూరు జిల్లాలో అద్భుత సన్నివేశం.. శివలింగం చుట్టూ మూడు నాగుపాముల ప్ర‌ద‌క్షిణ‌.

0
1

 

నెల్లూరు జిల్లా మనుబోలులోని కాశీ విశ్వనాథ ఆలయంలో ఘటన

ప్రదక్షిణ తర్వాత ఆలయంలోని పుట్టలోకి వెళ్లిన నాగుపాములు

గతంలోనూ ఇదే ఆలయంలో పలుమార్లు కనిపించిన నాగసర్పాలు

నెల్లూరు జిల్లాలో ఓ శివాలయంలో నేడు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మనుబోలు బీసీ కాలనీ సమీపంలోని శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం మూడు నాగుపాములు శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపించాయి. శివలింగాన్ని చుట్టుకొని, కొద్దిసేపు అక్కడే పడగవిప్పి ఉన్న సర్పాలను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ మూడు పాములు ఆలయంలోనే ఉన్న పుట్టలోకి వెళ్లిపోయాయి.

 

ఈ అరుదైన దృశ్యాన్ని కొందరు భక్తులు తమ ఫోన్లలో వీడియో తీయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజే ఇలా మూడు నాగసర్పాలు కనిపించడం దైవ సంకేతంగా భక్తులు భావిస్తున్నారు.