91వ వార్డు లక్ష్మీ నగర్ , గోపాలపట్నం లో రూ. 24.90 లక్షల తో అంగన్వాడి కమ్యూనిటీ బిల్డింగ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు గారు

0
3

విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 91వ వార్డులో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వ విప్ గణబాబు గారు పలు అభివృద్ధి పనులలో భాగంగా సుమారుగా. మొత్తం రూ. 20.90 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ బిల్డింగ్ ను స్థానిక నాయకులు , అంగన్వాడి టీచర్లు తో కలిసి రిబ్బన్ కట్ చేసి, కమ్యూనిటీ బిల్డింగ్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గణబాబు గారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని పేర్కొన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ, నాణ్యతా ప్రమాణాలతో పనులను సకాలంలో పూర్తి చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమవతి,CDPO నిలీమా DE వెంకట లక్ష్మీ , కూటమి నాయకులు నారిపిన్ని సత్తిరాజు , బంగారు తులసిరామ్ , నరవ అనూష , రొక్కం కొండలరావు , అలజంగి శ్రీను , సువ్వాడ మురళి , జీలని , రామకృష్ణ , సూరిబాబు ,శివ ,కానక AE శేఖర్ , జీవీఎంసీ సిబ్బంది , మరియు అంగన్వాడి టీచర్లు మొదలగున్న కూటమి నాయకులు పాల్గొన్నారు.