నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ దుస్థితి – పిల్లలకు ఆటస్థలం లేదు, శిథిలమైన గోడలు. ?

0
1

నెల్లూరు, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ (MPL CORPN HIGH SCHOOL, పిన్ కోడ్ 524004) పరిస్థితి అధ్వానంగా మారింది.

పాఠశాల ప్రాంగణంలో పిల్లలు ఆడుకోవడానికి సరైన వసతి లేదు. పాఠశాల చుట్టూ ఉన్న ప్రహరీ గోడలకు సిమెంట్ పెచ్చులూడి, రంగులు వెలిసిపోయి, పగుళ్లు ఏర్పడి ఉన్నాయి. ఇది పిల్లలకు ఎంతో ప్రమాదకరం.

అంతేకాకుండా పాఠశాల బయట ప్రధాన గేటు వద్ద పూర్తిగా చెత్త, వ్యర్థాలు వేస్తున్నారు. గేటు ముందు గడ్డి మొలిచి, పిచ్చి మొక్కలు పెరిగి దుర్వాసన వస్తుంది. పిల్లలు, ఉపాధ్యాయులు లోపలికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల దోమలు, రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాల గోడలకు మరమ్మతులు చేయించి, ప్రాంగణాన్ని శుభ్రం చేసి, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.