25 ఏళ్లలో భారత్‌ దిశ మార్చారు.. మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు.

0
2

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ప్రభుత్వ పదవిలో కొనసాగడం అసాధారణ ప్రయాణమని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల విశ్వాసమే ఆయన నాయకత్వానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. 2026 అక్టోబర్‌ 7తో మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ది హిందూ’లో రాసిన వ్యాసంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

 

మోదీ రాజకీయాలతో మాత్రమే ఇంతకాలం నాయకత్వాన్ని కొనసాగించలేదని చంద్రబాబు అన్నారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని పేర్కొన్నారు. వ్యక్తిగత నిజాయతీ, క్రమశిక్షణ, పనితీరు ఆ విశ్వాసానికి కారణమని తెలిపారు.