Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్సీపీ ఇంచార్జ్ ఎస్ నిస్సార్ అహ్మద్ విమర్శించిన వైనం.

0
3

Madanapalle: మదనపల్లె ప్రజల చిరకాల ఆకాంక్షగా నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె ఇంచార్జ్ ఎస్. నిస్సార్ అహ్మద్ విమర్శించారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీని సందర్శించి నిర్మాణ పనులు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో 95 ఎకరాల భూమి కేటాయించి, సుమారు రూ.85 కోట్లు ఖర్చు చేసి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.