ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష : జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా

0
3

మంచిర్యాల: ఐడిఓసి సమావేశ మందిరంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా సమీక్ష నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారి, మంచిర్యాల ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఏఈఆర్‌ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.18 ఏళ్లు నిండిన ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని యోగితా రాణా సూచించారు. నోటీసులు జారీ చేసిన ప్రతి ఓటరు సంబంధిత పత్రాలను సమర్పించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. భారత ఎన్నికల సంఘం సూచించిన 11 పత్రాల్లో నుంచి మాత్రమే సంబంధిత ఓటర్లు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.బూత్ స్థాయి ఏజెంట్లకు అవసరమైన సమాచారాన్ని బూత్ స్థాయి అధికారుల ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అంతకుముందు జైపూర్ మండలం ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 111, 112 పోలింగ్ కేంద్రాలను యోగితా రాణా సందర్శించారు. అక్కడి బూత్ స్థాయి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, ఓటర్ల సవరణ కార్యక్రమం నిర్వహణపై పలు సూచనలు చేశారు.