మంచిర్యాల నియోజకవర్గం | లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 02వ వార్డులో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు.
లక్షెట్టిపేట్ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, MRO దిలీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ఆన్లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత.. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే మా లక్ష్యం!
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి-వెంకటస్వామి గౌడ్, సింగిల్ విండో చైర్మన్ నాగభూషణం, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









