సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

0
3

మంచిర్యాల: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయవద్దని సూచించారు.జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం సందర్భంగా, ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్రూకత దివస్‌లో భాగంగా బుధవారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్, మంచిర్యాల పట్టణ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక వివరాలు, ఫొటోలను బహిరంగంగా పంచుకోవద్దన్నారు. సైబర్ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.OTP, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. రైతుల నమోదు, యూరియా యాప్ డౌన్‌లోడ్ తదితర పేర్లతో వచ్చే అనుమానాస్పద కాల్స్‌ను నమ్మవద్దన్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.“PAUSE FOR SAFETY – Pause. Think. Verify.” అనే విధానాన్ని పాటించాలని సీపీ సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు