🔸అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకుడికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శ..!

0
3

కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిర్రా పెద్ద అంకిరెడ్డి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం స్థానిక పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.

 

ఈ సందర్భంగా పెద్ద అంకిరెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.

 

అనారోగ్య సమయంలో అధైర్యపడవద్దని, పార్టీ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు భరోసా కల్పించారు. వైద్య చికిత్సకు అవసరమైన సహాయ సహకారాల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

 

పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కష్టకాలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.