హైదరాబాద్: అంగన్వాడి కేంద్రాలకు దసరా పండుగ సందర్భంగా 13 రోజుల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఐసీడీఎస్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ అకేశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సెలవుల విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందని జాయింట్ డైరెక్టర్ తెలిపారు. సోమవారం వరకు సెలవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.










