డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో మెగా వైద్య శిబిరం ప్రారంభం
🟠ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, అక్టోబర్ 8,bharat aawaz :
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో హాస్పిటల్ కమిటీ, వైద్య సిబ్బంది, కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
🟠వైద్య పరీక్షలు అందుబాటులోకి
ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
🟠రక్తదానం.. ప్రాణదానంతో సమానం
అత్యవసర పరిస్థితుల్లో ఒక్క యూనిట్ రక్తం మరొకరి ప్రాణాలను కాపాడగలదని ఎమ్మెల్యే సౌమ్య పేర్కొన్నారు. యువత స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా మానవతా విలువలు మరింత బలపడతాయని అన్నారు.
🟠స్వచ్ఛ హాస్పిటల్ అవార్డుపై అభినందనలు
ఎన్టీఆర్ జిల్లాలో స్వచ్ఛ హాస్పిటల్ అవార్డు అందుకున్న నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌కు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఆసుపత్రి పరిశుభ్రత, నిర్వహణతో పాటు రోగులకు మెరుగైన సేవలు అందించడంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్, పారిశుధ్య సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఉత్తమ నర్స్ అవార్డు గ్రహీతలను ప్రత్యేకంగా అభినందించారు.
🟠ఆసుపత్రి అభివృద్ధికి సహకారం
ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌ను అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ సభ్యులు, వైద్యులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










