రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి, నిరసనలో పాల్గొనేందుకు బయలుదేరిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
2

న్యూఢిల్లీ: ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బయలుదేరారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి అనంతరం నిరసనలో పాల్గొంటామని తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ఓటు చోరీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వంశీకృష్ణ స్పష్టం చేశారు. ప్రతి ఓటు విలువైనదేనని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కును కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.